విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరు: గంటా శ్రీనివాసరావు
విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇబ్బందులను మర్చిపోలేమన్న మాజీ మంత్రి
వైసీపీ మునిగిపోయే నావ అని తాను ఎప్పుడో చెప్పానని వ్యాఖ్య
ఇప్పుడు అది నిజం అవుతుందన్న గంటా శ్రీనివాసరావు
Trinethram News : Andhra Pradesh : వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, విజయసాయి రాజీనామా అంశంపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.
విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఆయన హయాంలో విశాఖపట్నం వాసులు పడిన ఇక్కట్లు, వారి విధ్వంసం, వారిపై దాడులను మర్చిపోలేమని పేర్కొన్నారు. ఇక వైసీపీ మునిగిపోయే నావ అని తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పడు అది నిజం అవుతుందని గంటా అన్నారు.
వైసీపీ నేతలు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఇప్పటికీ ఇంకా వక్రంగానే మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. వారి విధ్వంసం వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని తెలిపారు. దావోస్‌లో పారిశ్రామివేత్తల్లో నమ్మకం నిలిపి ఏపీ బ్రాండ్‌ను సీఎం చంద్రబాబు వివరించారని గంటా శ్రీనివాసరావు చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App