TRINETHRAM NEWS

మాదిగ యువకుడి మరణానికి కారణమైన ఎర్రగొండపాలెం ఎస్సై,సిఐలను అరెస్ట్ చేయాలి జగన్ ప్రభుత్వం మోజెస్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.

ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో పోలీస్ చిత్రహింసలకు గురై పెట్రోల్ పోసుకొని బలవన్మరణం పొందిన నాగిపోగు మోజెస్ మరణానికి కారణమైన ఎర్రగొండపాలెం ఎస్సై రాజేష్, సిఐ మారుతి కృష్ణ లను ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఐపిసి 306 ప్రకారం అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఒంగోలులోని హెచ్ సి ఎం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నీలం మాట్లాడుతూ ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో మాదిగ యువకుడు మోజేష్ ను కౌన్సిలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిచి చిత్రహింసలు పెట్టి కొడుకు కోసం వచ్చిన పాస్టర్ తండ్రి యోహానును అవమానించి వేధించటంతో మోజెస్ ఈనెల 6వ తేదీన ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న డన్నారు. పోలీస్ అధికారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మోజస్ను గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కొరకు చేర్పించారన్నారు.

మోజెస్ కుటుంబాన్ని ప్రలోభపరిచి పోలీస్ అధికారులు తమకు అనుకూలంగా స్టేట్మెంట్ రాయించుకున్నట్లు తెలుస్తుందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మోజేష్ వద్ద మరణ వాంగ్మూలం అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ను పిలిపించి చట్ట ప్రకారం తీసుకోవాల్సిందన్నారు. కనీసం వైద్య చికిత్స అందించిన డాక్టర్ అయినా సంబంధిత మార్కాపురం డిఎస్పి అయిన మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసిపి షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిచ్చయ్య అనే వ్యక్తి తన కులానికి చెందిన ఎస్సై రాజేష్, ఎర్రగొండపాలెం సిఐ మారుతీ కృష్ణ పుల్లలచెరువు ఎస్ఐ శ్రీహరి, దోర్నాల ఎస్ఐలను నియమించుకొని పోలీసు సెటిల్మెంట్లు చేస్తూ ఎర్రగొండపాలెం కలెక్షన్ వైసీపీ ఇన్చార్జి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడన్నారు.

పోలీస్ స్టేషన్లో మాదిగ యువకుడు పోలీసు వేధింపులతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఎస్సీ ఎస్టీ యాక్ట్ చైర్మన్, మరియు కలెక్టర్ దినేష్ కుమార్ మార్కాపురం సబ్ కలెక్టర్ చే విచారణ కూడా జరిపించలేదన్నారు. రెండు నెలల క్రితం త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో చల్లా గురువారెడ్డి అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిచి త్రిపురాంతకం ఎస్ఐ వేధించడంతో పురుగుమందు తాగి గురువారెడ్డి మరణించిన ఘటనలో పోలీసు నష్టపరిహారంగా సుమారు 20 లక్షల రూపాయలు వసూలు చేసి ఇచ్చారన్నారు. దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం లోనే అదే కులానికి చెందిన పోలీస్ వేధింపులతొ మరణించడం జగన్ సామాజిక న్యాయ పాలనకు నిదర్శనం అన్నారు. కావున మోజెస్ మరణానికి కారకులైన ఎస్సై సీఐలను ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అరెస్టు చేయాలని నీలం నాగేంద్రం డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆందోళనకారులు జగన్ పాలనలో దళితుల ప్రాణాలకు విలువ లేదంటూ నినాదాలు చేశారు . తదనంతరం ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ని కలిసి మోజెస్ పోలీస్ వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సి బి సి ఐ డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే మోజెస్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కొమ్ము సృజన్ మాదిగ చప్పిడి వెంగళరావు దారా అంజయ్య కాకుమాని రవి కలిసి డిమాండ్ చేశారు .