TRINETHRAM NEWS

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం దగ్గర T2 క్వటర్స్ లలో “బస్తీ బాట” నిర్వహించడం జరిగింది, సిఐటియు బస్తిబాట కార్యక్రమంలో కార్మిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా క్వటర్లన్నీ అద్వానమైన పరిస్థితులలో ఉన్నాయని సరియైన మంచినీరు లేక డ్రైనేజీ వ్యవస్థ బాగోలేక రోడ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వేలకోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు లాభాలు తీసుకొస్తున్న మా స్థానిక సమస్యలు ఎన్నిసార్లు విన్నవించిన పరిష్కరించడంలో యజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, పైగా మాకు సొంతిల్లు కావాలని పోరాడుతున్నప్పటికీ ఇతరులకు శివాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని యజమాన్యం పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినప్పటికీ అప్పుడప్పుడు మా ఇళ్ళల్లో ఫంక్షన్లు జరిగినప్పుడు ఉపయోగించుకున్న స్థలాన్ని పెద్దల అండతో పూజారికి ఇల్లు ఉన్నప్పటికీ దాన్ని కూడా ఆక్రమించుకొని బిల్డింగు నిర్మిస్తున్న పట్టించుకోని సింగరేణి యాజమాన్యం మేము మాత్రం చిన్న షెడ్డు వేసుకున్న అధికారులు వచ్చి ప్రశ్నిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,

ఇలాంటి పరిస్థితులలో సిఐటియుగా మీరు మా కుటుంబ సభ్యుల సౌకర్యాల కోసం బస్తి బాట నిర్వహించడం సంతోషకరంగా ఉందని తక్షణమే యజమాన్యం యొక్క తప్పుడు చర్యలను గట్టిగా ప్రశ్నించవలసిన అవసరం ఉందని కార్మిక కుటుంబ సభ్యులు తెలియజేశారు, ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజా రెడ్డి మాట్లాడుతూ సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు అహర్నిశలు కష్టపడి సంస్థ లాభాలలో ప్రధాన భూమిక పోషిస్తూ సంస్థ విస్తరణలో భాగ్యస్వామ్యులవుతున్న కుటుంబ సభ్యుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబ సభ్యులు నివసిస్తున్న క్వటర్లను పూర్తిస్థాయిలో రిపేర్ చేసి అది నూతనమైన డ్రానేజీని రోడ్ల వ్యవస్థను మెరుగుపరచాలని కార్మికులు కోరుకున్నట్టు శివాలయం ముందల ఉన్న పార్కింగ్ ప్లేస్ ఖాళీ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మిక కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కాలనీ బస్తీ వాసులతో పాటు SCEU-CITU రాజీ 1 కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, నంది నారాయణ, శివరాంరెడ్డి, అన్నవేణి శంకర్, సమ్మయ్య, G.జనార్ధన్, శ్రీనివాస్,.సాగర్, ప.శశి, రాజు, ఆదివిష్ణు, డి.నగేష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Employers should focus on