TRINETHRAM NEWS

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ .

అల్లూరిజిల్లా అరకులోయ/ త్రినేత్రం న్యూస్. జనవరి :14

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ బారాలను మోపి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందని పెంచిన సర్ చార్జీలు సర్దుబాటు చార్జీలు తక్షణమే రద్దు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ , ధరల పెరుగుదల తొ బడుగు వర్గాల జీవితాలు చితికి పోతున్నాయి ఆని,రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాలు తీవ్రస్థాయిలో మోపిందని సర్దుబాటు చార్జీల పేరుతో గతంలో వాడుకున్న విద్యుత్ ను ప్రస్తుత బిల్లుతో కలిపి వందలాది రూపాయలు పెంచుతున్నారని విద్యుత్ డిస్కంలో సంస్కరణల పేరుతో ప్రైవేట్ సంస్థలకు బడా వ్యాపారవేతలకు కట్టబెడుతున్నారని విద్యుత్ ప్రైవేటీకరణ చేయరాదని పెంచిన సర్దుబాటు చార్జీలు తక్షణమే రద్దు చేయాలని లేనిపక్షంలో 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటం స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటం నాంది పలుకుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సర్బగుడా హౌసింగ్ కాలనీ యువకులు ప్రభుదాస్ స్టాలిన్ దేవ్ భరత్ దేవ్ హష్మి దేవ్ సోమేశ్ కుమార్ చైతన్య ప్రదీప్ సుమిత్ర బంకా మోజెస్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App