అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.. వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. వాతావరణ మార్పుతో.. జలుబు, దగ్గుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో ఈ వైరల్ సమస్య చాలా సాధారణం.
చలి తీవ్రత ఇంకా పెరగడంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడనుంది. చలి పెరగడం వల్ల రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే ఈ సమయంలో ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.
చలికాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి. ప్రస్తుతం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు, దగ్గు రోగులు, జలుబు రోగులు భారతదేశంలోని అన్ని ఆసుపత్రులలో కనిపిస్తున్నారు. దీంతో పాటు కంటి నొప్పి, తలపోటు, అధిక రక్తపోటు, మానసిక అనారోగ్యం, వైరికోస్ వీన్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు అధికం.
ఉత్తర్ ప్రదేశ్ బారాబంకి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవధేష్ కుమార్ మాట్లాడుతూ శీతాకాలంలో సురక్షితంగా ఉండేందుకు పలు సూచనలు చేశారు. పెరుగుతున్న చలితో కొన్ని వ్యాధులు పెరుగుతాయన్నాయని ఆయన తెలిపారు. చలిపెరగడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు తలెత్తే పరమాదం ఉందన్నారు. దీనితో పాటు వైరల్ ఇన్ఫెక్షన్ల కేసులు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
చలికాలంలో సురక్షితంగా ఉండటానికి రెమెడీస్..
- హృద్రోగులు మరియు అధిక రక్తపోటు ఉన్న రోగులు ఉదయం వాకింగ్ చేయడం మానేయాలి.
- వృద్ధులు, పిల్లలు, రోగులు ఉన్ని దుస్తులను ధరించాలి, శరీరం పూర్తిగా కప్పుకొని ఉండటం మంచిది.
- చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో వేడి నీటినే వాడాలి. తాగడానికి కూడా వేడి నీటినే వాడాలి.
- పిల్లలు మరియు వృద్ధులు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వృద్ధులకు చల్లని పరిస్థితుల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
(గమనిక: ఈ సమాచారం డాక్టర్ అందించిన సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా నివారణను ప్రయత్నించే ముందు తప్పనిసరిగా నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి.