TRINETHRAM NEWS

Trinethram News : శుక్రవారం బాపట్ల కిరాణా మర్చంట్ కళ్యాణ మండపం నందు బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ 1964 ప్రెసిడెంట్ జయం వర బాబు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించడం జరిగినది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ శ్రీ ఎస్ బి శ్రీనివాసచారి మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించడంలో ఏజెంట్ కీలక పాత్ర పోషించాలని మరియు రాబోయే రోజులలో జరిగే మార్పులకు అనుగుణంగా ప్రతి ఏజెంట్ మారాలని ఆన్లైన్ ద్వారా పాలసీ చేయడంలో ఏజెంట్స్ శిక్షణ పొందాలన్నారు. ఏ ఇన్సూరెన్స్ కంపెనీలలో లేనివిధంగా ఎల్ఐసి వారు ఏజెంట్స్ కు గ్రాడ్యుటి మెడికల్ టర్న్ ఇన్సూరెన్స్ అందిస్తుందని అలాంటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఏజెంట్ పైన ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి సాధించిన ఏజెంట్స్ ను ఆయన ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి బాపట్ల బ్రాంచ్ మేనేజర్ జి గోపాలరావు, మరియు ABM కోటేశ్వరరావు, సుమన్, డెవలప్మెంట్ ఆఫీసర్ శాస్త్రి, ఆల్ ఇండియా నాయకులు ఎమ్మెస్ మూర్తి, ఉదయభాను, వెంకటరెడ్డి మరియు మచిలీపట్నం డివిజన్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, శ్రీనివాసరాజు, జి పద్మ మరియు బాపట్ల బ్రాంచ్ సెక్రటరీ ఎం జైకృష్ణ, ట్రెజరర్ గౌరీ శంకర్, బి సాంబయ్య, రాజేష్, కొల్లా శ్రీను, వీరాస్వామి, ఐ శ్రీను, పి శ్రీను, రామకృష్ణ, ఎస్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు