TRINETHRAM NEWS

మాజీ సర్పంచులు ముందస్తు అరెస్టు
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వెళ్లకుండా డిండి మండల పోలీసులు ముందస్తుగా మాజీ సర్పంచులు బొగ్గుల దొన సర్పంచ్ పండు కవిత చంద్రయ్య మరియు గోనబోయినపల్లి సర్పంచ్ ఎలిజాల మాధవయ్యను అరెస్టు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన ఇంకా రూపాయి కూడా పెండింగ్ బిల్లులు చెల్లించలేదని, పెండింగ్ బిల్లులపై ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి. పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని కోరారు. అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేరని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Early arrest of ex-serpents