TRINETHRAM NEWS

డిండి లో తాగునీటి కొరత.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

రిజర్వాయర్ ఉన్న తప్పని ఇబ్బందులు
సక్రమంగా తరపరా కానీ మిషన్ భగీరథ నీరు
పలుమార్లు విన్నవించిన స్పందించని అధికారులు.
ప్రాజెక్టులో నిండా నీరు ఉన్న డిండి పట్టణ ప్రజలకు మాత్రం తాగునీటి సమస్య తప్పడం లేదు. తాగునీరు సరిపడ రావడంలేదని ప్రజలు వాపోతున్నారు

ఈ విషయం చెప్పుకునేందుకు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీల పదవి కాలం ముగియడంతో వారు అందుబాటులో లేక, సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.
మిషన్ భగీరథ పథకంలో భాగంగా అందించే తాగునీరు డిండి పట్టణంలో వారంలో రెండు రోజులకు ఒకసారి అరకొరగా సరఫరా అవుతుండడంతో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డిండి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App