TRINETHRAM NEWS

అనపర్తిలో 26వ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం
త్రినేత్రం న్యూస్: అనపర్తి
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

అమ్మిరెడ్డి ఆయిల్స్ లిమిటెడ్ అధినేత సబ్బెళ్ళ అమ్మి రెడ్డి, సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు త్యాగరాజు-రామభక్తి అనే అంశంపై ప్రసంగం చేశారు.

ఈ కార్యక్రమం అనంతరం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తమలంపూడి చిన్న ఆదిరెడ్డి, కార్యదర్శి రఘునాథరెడ్డి, అనపర్తి గ్రామ పార్టీ కన్వీనర్ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి (మురళీ) మరియు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, సత్సంగం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App