TRINETHRAM NEWS

163 వ స్వామి వివేకానంద జయంతి టోర్నమెంటును ప్రారంభించిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మా శారద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కె ఆర్ ఆర్ ఛత్రపతి వాలీబాల్ టోర్నమెంట్ జాతీయ యువజనోత్సవం, 163 వ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మా శారద హాస్పటల్, ఎన్నెపల్లి డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కె ఆర్ ఆర్ ఛత్రపతివాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 30కి పైగా టీములు పాల్గొనడం జరిగింది. ఈ టోన్ కి ముఖ్యఅతిథిగా డాక్టర్ రాజశేఖర్ విచ్చేసి బాల్ ని సర్వీస్ చేసి టోర్నీని ప్రారంభించడం జరిగింది.

తర్వాత ఆయన స్వామి వివేకానంద ఆశయాలను యువత మార్గదర్శకంగా తీసుకుని మంచి బాటలోనడవాలని తెలపడం జరిగింది, అదేవిధంగా వారు చెప్పిన మార్గదర్శలని ఆయనఆదర్శంగా తీసుకొని మంచి సేవాకార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని అయన తెలిపారు. ఈ మొత్తానికి ఎంపైర్స్ గా సురేష్ , , శీను వ్యవహరించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ టోర్నీ చాలా అద్భుతంగా జరిగింది. ఈ టోనీలో ఫైనల్ లో శివారెడ్డి పెట్, మా శారదా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శివారెడ్డి విజేతగా నిలవడం జరిగింది.

ఈ టోర్నీలో విజేతలు మొదటి విజేత శివారెడ్డి పేట్ రెండవ విజేత మా శారద మూడవ విజేత ఎస్ ఏ పి కాలేజ్ వికారాబాద్ నాలుగో విజేత – జైదుపల్లి విజేతలుగా నిలవడం జరిగింది ఈ విజేతలకు ట్రోఫీ మరియు నగదు కూడా ఇవ్వడం జరిగింది. మా శారద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి , బిజెపి జిల్లా అధ్యక్షులు కోకట్ మాధవ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి , శివరాజ్ , కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ , చేవెళ్లే పార్లమెంటు కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి , బిజెపి స్టేట్ ఐటీ సెల్ కో కన్వీనర్ శ్రీకాంత్ , బిజెపి సీనియర్ నాయకులు సుధాకర్ ఆచారి , సాకేత్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ ఉదయ పంతులు, సాకేత్ నగర్ కౌన్సిలర్ అనంతరెడ్డి , బిజెపి ధార్మిక్ సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి , జాయింట్ కన్వీనర్ రాఘవేందర్ , బిజెపి సీనియర్ నాయకులు రాములు , మా శారదా హాస్పిటల్స్ సిబ్బంది, వాలంటరీస్ కూడా పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App