వైకల్యాలను ఓటమిగా అంగీకరించవద్దు: ఎంఈఓ
Trinethram News : ప్రకాశం జిల్లా కంభం.
కంభం: వైకల్యాలను ఓటమిగా అంగీకరించవద్ధని, లోపాలను శాపాలుగా భావించవద్దని ఎంఈఓలు బి.మాల్యాద్రి , టి.శ్రీనివాసులు అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దివ్యాంగులైన చిన్నారులతో కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓలు మాల్యాద్రి,శ్రీనివాసులు ప్రధానోపాధ్యాయులు బి.వి.రామకృష్ణ ,ప్రత్యేక ఉపాధ్యాయులు నూర్జహాన్ ,క్రాంతి కుమార్ తదితర వక్తలు మాట్లాడుతూ సమగ్ర, సుస్థిర భవిత కోసం దివ్యాంగులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని,వారిలో దాగివున్న ప్రతిభను గుర్తించి,వ్యక్తిగత శిక్షణ ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని అన్నారు. దివ్యాంగులలో సామాజిక చైతన్యం కల్పించి వారిని సమాజంలో భాగస్వామ్యం చేసేందుకు,సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించాలన్నారు. దివ్యాంగులు సమాజంలో గౌరవ ప్రదంగా జీవించేందుకు, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.అనంతరం చిన్నారులకు బహుమతులను అందించి సంబరాలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు నూర్జహాన్, క్రాంతి కుమార్, ఐఈఆర్టీలు అరుణ్ కుమార్,ఈశ్వరి, ఉపాధ్యాయులు వరికుంట్ల.వెంకటేశ్వర్లు మస్తాన్ వలి, దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App