డొలి మోత – తప్పని గిరిజనుల తల రాత
అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 4. ఇక డోలి రహిత ఏజెన్సీ నీ చూడబోతారు ఆని, నాయకుల అధికారులు చెప్పినా హామీలు అమలు అయ్యేల కనిపించడం లేధు.. వివరాల్లోకి వెళితే అరకులోయ మండల కేంద్రం, మడగడ పంచాయితీ, మెచ్చగూడ, తదితర గ్రామాల్లో సరి అయిన రహదారి సౌకర్యం లేక గిరిజనులు డోలినే నమ్ముకున్నారు. ఆని వారి బాధలు త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్ తొ పంచుకున్నారు.
స్థానిక యువ నాయకుడూ సమర్థి రాంచందర్ మాట్లాడుతు, మా ఆదివాసి ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో రహదారి సౌకర్యం లేక, వైద్యం కోసం డోలీమోతలు తప్పని దుస్థితిలో గిరిజన ప్రజల బతుకులు ఉన్నాయి,వాటి కొరకు నిధులు మంజూరు చేయకుండా, ఉత్సవాల పేరిట కొట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తున్నారని,వాటి వల్ల గిరిజనులకు ఒదిగేదేమి లేదని పేర్కొన్నారు.
ఆదివాసి ప్రాంతంలో 1/70 చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే గిరిజనులపై కూటమి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనబడుతుందని,మా ఆదివాసి చట్టాలు పటిష్టంగా అమలుపరిచి, విద్య,వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు, మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత, ఏ ఉత్సవాలైనా నిర్వహించాలని తెలిపారు.
ఇది కేవలం వ్యాపార ఉత్సవాలెనని నిజమైన గిరిజన సంప్రదాయ ఉత్సవాలు కాదని పేర్కొన్నారు. గ్రామస్తులైనటువంటి, సన్యాసిరావు, వంతల కామరాజు, చందర్ బంగార్రాజు, అప్పలరాజు, ఫీసా కమిటీ ప్రెసిడెంట్ పాంగిరాజు,వారి బాధను వెల్లబుచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App