TRINETHRAM NEWS

తేదీ: 04/01/2025.
ప్రారంభమైన డొక్కా సీతమ్మ భోజన పథకం.
జీలుగుమిల్లి: (త్రినేత్రం న్యూస్): విలేఖరి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలంలో ఉన్న జూనియర్ కళాశాల నందు డొక్కాసీతమ్మ పేరుతో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు, ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ చేసిన సేవలను స్మరిస్తూ , ఇటువంటి గొప్ప మహనీయురాలి పేరు మీదగా
ఈ పథకం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం అనడం జరిగింది. గొప్ప ఆలోచన, ప్రతిపాదన ఆలోచించినటువంటి ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు కు ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల యాజమాన్యం, ఉమ్మడి కూటమి నాయకులు చాట్రాయి ప్రసాద్, కొండపల్లి ప్రసాద్, రాజేంద్ర, గద్దె సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App