ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాన్న భోజనపథకం.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు) జిల్లాఇంచార్జ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ పాల్గొన్న కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ డొక్కా సీతమ్మ తాలూకా గొప్పతనాన్ని వివరిస్తూ ఒక ఆదర్శవంతమైన మహిళ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడగలదో తన సామాజిక సృహ ఏమిటో నిరూపించుకుంటూ లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలు వరదలు విపత్తులు కారణంగా, ఎన్నో ఇబ్బందులు ఎదురుకునే సమయంలో అటువంటి వాళ్లకు అన్నం పెట్టీ ఆదుకొని, నేటి సమాజానికి ఆదర్శవంతంగా నిలిచిన డొక్కా సీతమ్మ గారి యొక్క పేరుతో జనసేన పార్టీ అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన శిబిరాలు, సేవ కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే,అని అన్నారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలకు పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుండా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల పేర్లు, రూపకల్పన చేస్తున్న తరుణంలో అందులో భాగంగా డొక్కా సీతమ్మ గారి పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ప్రతిపాదించడం, రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ఆమోదించడం తద్వారా జూనియర్ కళాశాల విద్యార్థి, విద్యార్థినిలకు, మధ్యాన్న భోజన పథకం పెట్టి స్వచ్చమైన భోజనం అందిస్తూ, ఉన్నతమైన మంచి విద్యను అభ్యస్తిస్తూ, భవిష్యత్తులో వాళ్లకు మంచి భవిష్యత్తును అందించాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అదర్శమైనటువంటిది. నేటి తరం విద్యార్ధిని విద్యార్దులు డొక్కా సీతమ్మ గారి ఆశయాలకు, ఆచరించి ఆమె యొక్క స్ఫూర్తితో నడవాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థి విద్యార్థిలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, డొక్కా సీతమ్మ అపర అన్నపూర్ణమ్మ అని,ఆపదలో అమ్మలా వచ్చావు అని కాకుండా అమ్మే దిగి వచ్చి అన్నం పెట్టే దేవత, కడుపుచేత పట్టుకొని నడిచే ప్రతి అడుగుకి బలాన్ని నింపే దైవం, అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అంటారు. నేడు జరుగుతున్న ప్రతి అన్నదానానికి నీ నామమే తొలి వాచకం అమ్మ.అని ఇలాంటి ఆదర్శమూర్తులను, ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థి, విద్యార్థిని లతో కలిసి భోజనం చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాస్ రావు సభ అద్యక్షతన డియివో బ్రమ్మాజి, డి.ఐఈఓ పి.అప్పలరాజు,కళాశాల సిబ్బంది పాడేరు మండల ఎం.పి.పి.రత్నకుమారి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రా నాగరాజు, విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కిట్లంగి పద్మ, అధికార ప్రతినిధి బొనుకుల దివ్యలత, అరకు పార్లమెంట్ ఎక్సిక్యుటివ్ కమిటీ మెంబర్ కొర్ర కమల్ హాసన్, ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ.హెచ్ అనిల్ కుమార్, పాడేరు టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్, హుకుంపేట మండల అధ్యక్షులు కోటేశ్వరరావు పాడాల్, సుర్ల సుమన్, మజ్జి సంతోష్,పూజారి శివ, డి వెంకట రమణ, లగిసిపల్లి సర్పంచ్, కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.