Trinethram News : పెద్దపల్లి జిల్లా: ఫిబ్రవరి 25
మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణా నగర్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో యేసు, కాట మోక్షిత్ గౌడ్, కొలిపాక శాన్వికలకు తీవ్ర గాయాల య్యాయి.
గాయపడ్డ వారిని హుటాహుటిన కరీంనగర్, గోదావరిఖని ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలిం చారు.