
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను పరిశీలించిన దొడ్ల వెంకటేష్ గౌడ్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 1: 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా వార్డ్ ఆఫీస్ లో ఇందిరమ్మ ఇండ్ల కోసం నూతనంగా స్వకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజాపాలన లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు మరియు ఇంతకు ముందు దరఖాస్తు చేసుకుని ఆన్ లైన్ లో పేరు రానివారు శంషిగుడా వార్డ్ కార్యాలయం వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇండ్ల కోసం నమోదు చేసుకోవాలని తెలియచేసారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, అధికారి మీ ఇంటి వద్దకు వచ్చి సర్వే చేసుకుని, ఫోటో తీసుకుంటే సర్వే ప్రక్రియ ముగిసినట్లే అని అట్టివారు మరల వార్డ్ ఆఫీస్ కు వెళ్లే అవసరం లేదని అన్నారు.
ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ప్రజలందరూ సమన్వనం పాటించ్చి అధికారులకు సహకరించాలని కోరారు.కార్యక్రమంలో వార్డ్ ఆఫీస్ అడ్మిన్ శ్రీనివాస్, సి.ఓ ముస్తఫా, ఆపరేటర్ ప్రభావతి, బిల్ కలెక్టర్ కుమార్, నాయకులు గుడ్ల శ్రీనివాస్, రాజుగౌడ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
