పేదలను పంపించి కబ్జాదారుల కబ్జాకు సహకరించారు,మీరైనా న్యాయం చెయ్యండి.
ప్రజాదర్బార్ లో సీపీఐ నాయకులు వినతి.
నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ప్రజాదర్బారుకు కుత్బుల్లాపూర్ మండల నాయకులు పాల్గొని గత ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ మండలం లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని బిఆర్ఎస్ నాయకులు కబ్జాచేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగుతున్నాయని కావున కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి బుకబ్జాదారుల పై చర్యలు తీసుకొని,ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని తమ ప్రభుత్వం కబ్జాదారులపై కఠినంగా వ్యవహరిస్తోందనే సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో 2022 అక్టోబర్ నెలలో సర్వే నెంబర్ 329 లో పేద ప్రజలు గుడిసె వేసుకుందాం అంటే ఒకేసారి 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ బలగాలతో కాపలా కాసి నాయకులను అరెస్టు చేసిన అధికారులు అదే భూమిలో కబ్జాదారులు ఇండ్లు కడితే మాత్రం ఏమి అనలేదని,ఇదే విషయం పై అధికారులను ప్రశ్నిస్తే సమాధానం లేదన్నారు. కావున ఎన్నికల ప్రచారంలో భూకబ్జాలను అరికడ్తమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకొని పేద ప్రజల ప్రభుత్వం అని చాటుకోవలని అన్నారు.
అధికారులకు ఇచ్చిన వినత పత్రంలో గాజులరామరం సర్వే నెంబర్ 329,342,326,307,
12, ఎస్ ఎఫ్ సి భూములు, జగతగిరిగుట్ట డివిజన్ 348/1 దేవాదాయ భూమి,భూదేవి హిల్స్,పరికిచేరువు కబ్జా,మహాదేవ పురంలో గుట్ట పై వెలుస్తున్న ఇండ్లు,సురారం డివిజన్ విశ్వకర్మ కాలనీ,సురారం కట్టమైసమ్మ చెరువు కబ్జా,ఇతర అంశాలను కూడా పొందుపర్చి తక్షణమే పై సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావ్, ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్,మండల సహాయ కార్యదర్శి రాము,కూకట్పల్లి మండల కార్యదర్శి కృష్ణ,నాయకులు సహదేవ్ రెడ్డి, ఇమామ్,సుంకిరెడ్డి,అక్రం తదితరులు పాల్గొన్నారు.