
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేవరకద్ర పట్టణానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలు బీజేపీ నాయకులు వారి యాత్రకు ఘన స్వాగతం పలికారు. మోడీ సారధ్యంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
