Trinetharam News : ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారిని జోగులాంబ గద్వాల జిల్లా మెగాఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న గారు మెగా అభిమానులు మర్యాద పూర్వకంగా ఆదివారం చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ నందు ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం పట్ల జిల్లా అధ్యక్షుడు బోయ జమ్మన్న హార్షం వక్తం చేస్తూ వారికీ శాలువా పుష్పగుచ్ఛం ఇచ్చి ఫోటో ఫ్రేమ్ ను బహుకరించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. అన్నయ్య భవిష్యత్తులో ఇంకా ఉన్నతస్థానాలకు ఎదగాలని మరిన్ని అవార్డులు పురస్కారాలు దక్కించుకోవాలని భగవంతుడుని కోరుకున్నట్లు జిల్లా మెగా ఫ్యాన్స్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మెగాఫ్యాన్స్ రఘు పరుశ సురేష్ (గ్యాంగ్ లీడర్) సిద్దు గోనెగండ్ల జగదీష్ వేణు శివ ఐజ రాము రాజు నారాయణ పేట శ్యామ్ వనపర్తి జిల్లా నాగరాజు STD రాజు తదితరులు పాల్గొన్నారు.