జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా బసంత నగర్ లోని వడ్డెర కాలనీలో నిర్వహించుచున్న నిక్షయ్ శిబిరమును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డా . అన్నా ప్రసన్న కుమారి ఆకస్మికంగా సందర్శించారు. క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం లో భాగంగా నిర్వహించు చున్న ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి గ్రస్తుల ను గుర్తించుటకు తెమడ పరీక్షలను సేకరించుట, ఎక్స్ రే పరీక్షలు అవసరమైన వారిని పరీక్షకు తరలించుట పై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో పూర్వము క్షయ వ్యాధి సోకి తగ్గిన వారు, క్షయ వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులు, పోషకాహార లోపం గలవారు, మధుమేహం కలవారు, హెచ్ఐవి సోకిన వారు మరియు 60 సంవత్సరముల వయసు పడిన వారందరికి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించు కోవాలి అని అన్నారు.
వడ్డెర కాలనీ, బసంత నగర్ లో నిర్వహించిన శిబిరం నందు (37) తెమడ పరీక్షలు , అప్పన్నపేట యందు (19) తెమడ పరీక్షలు సేకరించారు. వీటిని క్షయ వ్యాధి నిర్దారణ కొరకు టి- హబ్ డయాగ్నోసిస్ కేంద్రము కు పంపించారు . అప్పన్నపేట యందు జరిగిన నిక్షయ్ శిబిరమును టి. బి (పో (గాం అధికారి డాక్టర్ కే. వి . సుధాకర్ రెడ్డి పర్యవేక్షించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App