జంతు సంరక్షణ చర్యలపై రూపోందించిన పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష
పెద్దపల్లి, జనవరి -29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జంతు సంరక్షణకు పాటించాల్సిన నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, నిబంధనల మేరకు జంతువులను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షఅన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జంతు సంరక్షణ చర్యలపై రూపోందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జంతు సంరక్షణకు భారత ప్రభుత్వం జాతీయ జంతు కళ్యాణ మండలిని (ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ను స్థాపించిందని, వీధి కుక్కలు జంతువుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు.
కుక్క కాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుక్క ఒకవేళ కరిస్తే వెంటనే తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ,జి ప్రకారం అడవులు, సరస్సులు, నదులు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని కలెక్టర్ తెలిపారు.
పెంపుడు జంతువులకు తప్పకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని, వాటిని నిర్దయగా బయట వదిలి వేయవద్దని, పశువులను ఇతర జంతువులను, పక్షులను రవాణా చేసే సమయంలో తప్పనిసరిగా జంతు రవాణా నిబంధనలు పాటించాలని, వన్యప్రాణులను చూస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి వాటిని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించుటకు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.
వీధి కుక్కలను చంపుట వేరే ప్రాంతాలకు తరలించుట, హింసించుట నేరమని, జంతు సంరక్షణ కొరకు సేవ చేయు వారికి, స్వచ్ఛంద సంస్థలకు ప్రతి పౌరుడు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్ , జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App