TRINETHRAM NEWS

District Collector Muzammil Khan said that the modernization work of the task building should be completed in 15 days

*టాస్క్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి భవన ఆధునీకరణ పనులు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జూన్ -14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టాస్క్ భవనం ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని, 15 రోజుల్లో ప్రతిపాదించిన పనులు పూర్తిచేసి ప్రారంభానికి సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను సూచించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం లోని టాస్క్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి టాస్క్ భవనం ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. పెద్దపల్లి టాస్క్ భవన ఆధునీకరణ పనులను ఆసాంతం పరిశీలించిన కలెక్టర్, పనులు వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జూలై 15 నుంచి టాస్క్ భవనంలో మొదటి బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యేలా జూన్ 30 లోగా పనులు పూర్తి చేయాలనీ తెలిపారు.

కార్పొరేట్ లుక్ వచ్చే విధంగా టాస్క్ భవనం ఆధునీకరణ ఉండాలని, టాస్క్ భవనంలో వినియోగించే విద్యుత్ లైట్లు మోడ్రన్ లుక్ తో ఉండే విధంగా చూసుకోవాలని, మంచి స్టాండెర్డ్ కంపెనీ లైట్లు వినియోగించాలని కలెక్టర్ సూచించారు. టాస్క్ భవనంలో విద్యార్థుల కోసం మోడర్న్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్, పి.ఆర్. – డి.ఈ. శంకరయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Muzammil Khan said that the modernization work of the task building should be completed in 15 days