TRINETHRAM NEWS

బేగంపేట పి.హెచ్.సి లో 3 సిబ్బంది సస్పెన్షన్, 1 వైద్యాధికారికి షోకాజ్ నోటీసు జారి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, జనవరి – 16: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

  రామగిరి మండలం బేగంపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే  3 వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తూ, 1 వైద్య అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

గురువారం నాడు  ఉదయం 11.45 గంటలకు బేగంపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిబ్బంది విధులకు గైర్హజరవడం గమనించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించగా ఆ సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు గైర్హాజరు గమనించిన కలెక్టర్ , పలుమార్లు ఆ సిబ్బందికి మెమోలు జారీ చేసినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ స్టాఫ్ ఈ.ఉమా దేవి, హెల్త్ సూపర్వైజర్ కే.పుష్పవతి , ఎం.పీ.హెచ్.ఈ.ఓ ఏ. సీతా రామయ్య ను సస్పెండ్ చేసినట్లు, వైద్య అధికారి డాక్టర్  జె. ప్రదీప్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్  ఆ ప్రకటనలో తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App