District Collector Koya Shri Harsha should resolve public hearing applications promptly
*సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, జూలై -8: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ,ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల లచ్చయ్య గ్రామశివారులోని సర్వే నెంబర్ 133 లో 10 గుంటలు, 160లో 21 గుంటల భూమి మోఖాపై వరి పంట వేసుకుంటున్నామని, పట్టా చేయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా,ఎలిగేడు తహసిల్దార్ కార్యాలయానికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
మడక మాజీ ఎంపీటీసీ ఆవుల ముత్తయ్య సుల్తానాబాద్ నుంచి గుంపుల వరకు ఆర్ అండ్ బి రోడ్డుకు కొన్నిచోట్ల గుంతలు ఉన్నాయని, వాటిని మరమ్మత్తు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా,ఈ ఆర్ అండ్ బీకి రాస్తూ వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి మండల పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన కే.సతీష్ కుమార్ గ్రామంలోని రెండవ వార్డులో ఇటీవల సిసి రోడ్డు నిర్మించారని, వర్షపు నీరు వెళ్లేందుకు పైపులు వేయలేదని, వర్షపు నీటి ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని, వర్షపు నీటిని మురికి కాలువలోకి మళ్ళించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఆడెపు భాగ్యమ్మ తన భర్త ఆడెపు సాంబమూర్తి 2020 జూలై 25న కరోనా కారణంగా చనిపోయారని, కరోనాపరిహారం, వితంతు పెన్షన్ అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App