![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-12.27.37.jpeg)
జిల్లా వెబ్ సైట్ నందు పూర్తి వివరాలు పొందుపరచాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఫిబ్రవరి-5 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాకు సంబంధించిన స్కీమ్స్, ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎన్ఐసి వారికి జిల్లా అధికారులు అందజేసినచో జిల్లా వెబ్సైట్ నందు పొందుపరచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు
బుధవారం సమీకృత జిల్లా సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్లు అరుణ
డి. వేణు తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అందించే సమాచారాన్ని ప్రతి సోమవారం వెబ్సైట్ నందు అప్డేట్ చేయడం జరుగుతుందని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే హెల్ప్ డెస్క్ కు జిల్లా అధికారులు తమ యొక్క కార్యాలయం ద్వారా నిర్వహించే స్కీమ్స్, ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన బ్రోచర్లను, సమాచారాన్ని అందించిన చో హెల్ప్ డెస్క్ నందు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా తమ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి యొక్క ఫోన్ నెంబర్ ను హెల్ప్ డెస్క్ కు అందించాలని,
పాత పెండింగ్ ఫైల్స్ మరియు పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్పోజ్ చేయాలని, ప్రతి కార్యాలయంలో అధికారి మరియు సిబ్బందికి సంబంధించి వారి యొక్క పేరు హోదాతో కూడిన నేమ్ ప్లేట్లను తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.
ఎం.ఎల్.సి ఎలక్షన్ కు సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రాన్స్పోర్ట్ బ్యాలెట్ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ లకు సంబంధించిన ప్రణాళికను ఇప్పటినుండే రూపొందించుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ. గంగయ్య, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Koya Shri Harsha](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-12.27.37-1024x494.jpeg)