ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, జనవరి 19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కలెక్టరేట్ లో సోమవారం నాడు (20.01.2024) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ఈనెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి (ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ) సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో నిమగ్నం అయినందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్
ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App