పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*జాతీయ రహదారుల ఆర్బిట్రేషన్ చెల్లింపులు వేగవంతంగా పూర్తి చేయాలి
*ధరణి పెండింగ్ దరఖాస్తులు, జాతీయ రహదారుల భూ సేకరణ చెల్లింపులు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన కలెక్టర్
పెద్దపల్లి, డిసెంబర్- 09: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధరణి పెండింగ్ దరఖాస్తులు, జాతీయ రహదారుల భూ సేకరణ చెల్లింపుల పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి. వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష, డివిజన్ వారిగా పెండింగ్ ధరణి దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి వెబ్ సైట్ లో నూతనంగా పెండింగ్ మ్యూటేషన్, పెండింగ్ సక్సెషన్ మొదలగు మాడ్యుల్స్ ను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారులకు బదలాయించడం జరిగిందని, వీటిని వేగవంతంగా క్లియర్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ఆర్బిట్రేషన్ సంబంధిత రైతులకు వేగవంతంగా చెల్లింపులు చేయాలని, జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరగా గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు నేషనల్ హైవే అథారిటీకి పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి. గంగయ్య, సురేష్, గోదావరిఖని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App