TRINETHRAM NEWS

District Collector Koya Harsha should achieve the goals set on raising the standard of education

*పాఠశాలకు విద్యార్థుల హాజరు పెరిగేలా ఫాలో అప్ చేయాలి

*తుర్కలమద్దికుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, సెప్టెంబర్ -13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు దిశగా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి మండలంలోని తుర్కలమద్దికుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతం తక్కువగా ఉండటం గమనించిన కలెక్టర్ పిల్లల హాజరు పై సైతం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రెగ్యులర్ గా పాఠశాలకు రాని విద్యార్థులను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలైనా చదవడం,రాయడం, బేసిక్ గణిత పరిజ్ఞానం ఉండే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.

కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతున్న ఉపాధ్యాయులు అక్కడ అందిస్తున్న సూచనలు పాటిస్తూ వినూత్న రీతులు విద్యార్థులకు విద్యాబోధన చేయాలని అన్నారు. రెగ్యులర్ గా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ వారి ప్రమాణాలను పరీక్షిస్తూ దాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై శ్రద్ధ వహించాలని అన్నారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజులత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Harsha should achieve the goals set on raising the standard of education