District Collector Koya Harsha said women should achieve financial independence
*అడవి శ్రీరాంపూర్ జడ్పీహెచ్ఎస్ ప్రహారీ గోడ మరమ్మత్తులకు ప్రతిపాదనలు రూపొందించాలి
*ముత్తారంలో మహిళా సంఘాలచే ఏర్పాటు చేసిన మిల్క్ పార్లర్ ప్రారంభం
ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష
ముత్తారం, ఆగస్టు-14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని వినియోగించుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష ముత్తారం మండలంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ తో కలిసి విస్తృతంగా పర్యటించారు .
ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలల్లోని తరగతి గదులలో విద్యాబోధనను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అడవి శ్రీరాంపూర్ జడ్పీహెచ్ఎస్ ప్రహారీ గోడ మరమ్మత్తులకు అవసరమైన అంచనాలను రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడవి శ్రీరాంపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు కలెక్టర్ టీ షర్ట్ లు అందజేశారు.
ముత్తారం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద శ్రీ రాజమాత గ్రామ సంఘం ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన శ్రీయాన్ మిల్క్ పార్లర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద స్వశక్తి మహిళా సంఘాలకు బ్యాంకు ద్వారా రుణాలు అందజేసి వారి వ్యాపార యూనిట్ల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
జిల్లాలో 12 రకాల వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నామని, మహిళా సంఘాలచే మీసేవ కేంద్రాలు ఆహార శుద్ధి కేంద్రాలు, పౌల్ట్రీ యూనిట్ మొదలగు వివిధ వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద లక్షా 90 వేల రుణం తో ముత్తారంలో మిల్క్ పార్లర్ ఏర్పాటు చేశామని, దీనినే సమర్థవంతంగా నిర్వహించుకొని మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలవాలని అయన సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ అవకాశాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్థిక స్వలంబ సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అనంతరం ముత్తారం మండలంలో ఖమ్మంపల్లి గ్రామంలో ఇటీవలే ప్రారంభించిన ఇసుక రీచ్ ను కలెక్టర్ పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, ముత్తారం ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి బి కిరణ్ ,పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం.వరలక్ష్మీ, ఎడిఎం డి .పద్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App