TRINETHRAM NEWS

ట్రెంచ్ కటింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*కన్నాల, పందులపెల్లి గ్రామాలలో ట్రెంచ్ కటింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

జాతీయ రహదారి కింద సేకరించిన భూములలో ఎసంగి పంటలు సాగు చేయరాదు

పెద్దపల్లి , డిసెంబర్-28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ -మంచిర్యాల జాతీయ రహదారి ఎన్.హెచ్ 163 జీ నిర్మాణానికి సేకరించిన భూములలో ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేసి జాతీయ రహదారి ఆథారిటి అప్పగించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష మంథని మండలంలోని కన్నాల, పందులపెల్లి గ్రామాలలో ట్రెంచ్ కటింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, మంచిర్యాల- వరంగల్ -ఖమ్మం జిల్లాలను కలిపే 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే సేకరించిన భూమిని జాతీయ రహదారుల అథారిటీ అప్పగించామని, మంథని మండలం కన్నాల, పందులపెల్లి గ్రామాలలో ట్రెంచ్ కటింగ్ పనులను ప్రారంభించిందని, భూములలో ట్రెంచ్ పనులను సకాలంలో పూర్తి చేసి, జాతీయ రహదారి నిర్మాణ పనులు సజావుగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.జాతీయ రహదారి కింద సేకరించిన భూములలో ఎసంగి పంటలు సాగు చేయరాదని రైతులకు సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని తహసిల్దార్ రాజయ్య, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App