TRINETHRAM NEWS

లేఔట్ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*నవంబర్ 15 నాటికి రెండవ స్థాయి లాగిన్ లో దరఖాస్తులను పూర్తి చేయాలి

*ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -05: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో పెండింగ్ లే ఔట్ క్రమబద్ధీకరణ దరఖాస్తులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ఎల్ 1 లాగిన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, పెండింగ్ ఉన్న దరఖాస్తులను వారం రోజుల లోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెండవ స్థాయి లాగిన్ ఎల్ 2లో ఉన్న దరఖాస్తులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

స్క్రూటినీ పూర్తి చేసుకున్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులకు క్రమబద్ధీకరణ ఫీజు వివరాలను దరఖాస్తుదారులకు తెలియజేసి వారిని ఫాలో అప్ చేస్తూ వేగవంతంగా ప్రభుత్వానికి క్రమబద్ధీకరణ రుసుము చెల్లించేలా చూడాలని, రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ లను పంపిణీ చేయాలని
కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, డి . ఎల్ .పి. ఓ.లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App