కార్పొరేషన్ పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*కోటి నాలుగు లక్షల రూపాయలతో పారిశుద్ధ్య వాహనాల ప్రారంభం
*రామగుండం కార్పొరేషన్ లో నూతన వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్,ఏం.ఎల్. ఏ.
నవంబర్ -16:- గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో నూతనంగా కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు సామాగ్రిని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కోటి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి 5 ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు, 8 ఇతర భారీ వాహనాలు, 70 త్రిబుల్ లిట్టర్ బిన్స్, 100 రెండు చక్రాల బారోలను ప్రారంభించుకున్నామని కలెక్టర్ తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలో నూతనంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలు, సామాగ్రి వినియోగిస్తూ నగరం పరిధిలో పారిశుధ్య నిర్వహణ పెంచాలని అన్నారు. మన నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య విభాగం బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రామగుండం నగరం శుద్ధిగా మార్చేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేశామని అన్నారు.
గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రామగుండం నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో నగరంలో స్పష్టమైన మార్పు తీసుకువస్తామని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని, అధికారులతో సహకరించాలని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మనము మన వంతు పాత్ర పోషించాలని అన్నారు. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకునే విధంగా నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, బయట చెత్త వేయకుండా సంబంధిత సిబ్బందికి మాత్రమే అప్పగించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App