డిసెంబర్ వరకు వేయ్యి ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*లాభసాటి పంట ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి
*ఆయిల్ ఫామ్ సాగుకు డ్రిప్ సౌకర్యం కల్పన వేగవంతం చేయాలి
ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై రివ్యూ నిర్వహించిన కలెక్టర్
పెద్దపల్లి, అక్టోబర్ -24: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపెల్లి జిల్లాలో కొత్తగా 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, మన జిల్లాలో ప్రస్తుత సంవత్సరం నూతనంగా 324 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు ప్లాంటేషన్ చేయడం జరిగిందని, మరో 350 ఎకరాలలో ప్లాంటేషన్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ నాటికి పెద్దపెల్లి జిల్లాలో కొత్తగా 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతుల నుంచి మొక్కలకు, డ్రిప్ కోసం వెంటనే డీడీలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు. డీడీలు సమర్పించిన రైతులకు మొక్కల సరఫరా, డ్రిప్ సౌకర్యం ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.హెచ్.ఎస్.ఓ జగన్మోహన్ రెడ్డి, ఏడిఏ కాంతారావు, హార్టికల్చర్ అధికారులు జ్యోతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App