ప్రాథమిక విద్య పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*విద్యార్థులలో పఠనం ,గణితం సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు
*ప్రతి రోజూ పాఠశాలలో 7,8వ పీరియడ్స్ లో రిమీడియట్ బోధన
*ప్రాథమిక విద్య బలోపేతం పై సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, డిసెంబర్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నాను.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపెల్లి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, ప్రాథమిక విద్యను మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పటిష్టం చేసేందుకు ఉపాధ్యాయులంతా కలిసి కృషి చేయాలని , విద్యార్థులలో పఠనం, గణిత సామర్థ్యాలు పెంచాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా అధికారులు పాఠశాలలను సందర్శించినప్పుడు బోధన ప్రక్రియలో కొన్ని లోటు పాట్లు గమనించడం జరిగిందని, వాటిని గుర్తించి అన్ని పాఠశాలలలో వీటిని అభివృద్ధి చేయుటకు జిల్లాలోని ఒక వెయ్యి 75 మంది ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు డిఆర్పీల ద్వారా 14 మండలాలలో కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని అన్నారు.
పాఠశాలలో బోధన విధానంలో ఉన్న లోపాలను సవరించుకొని మీ పాఠశాలలోని 80 శాతం పిల్లలలో పఠన ,గణిత సామర్ధ్యాలు పెంచినట్లయితే జిల్లా స్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులకు ప్రోత్సాహక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలపడం జరిగింది. విద్యార్థులలో సామర్ధ్యాలను పెంచుటకై మధ్యాహ్నం షెడ్యూల్ లో ఏడు, ఎనిమిది పీరియడ్స్ ను రిమీడియట్ బోధనను నిర్వహించాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App