TRINETHRAM NEWS

District Collector Koya Harsha said public problems should be solved in order of priority

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, సెప్టెంబరు-23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్  కోయ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్  కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  జే.అరుణశ్రీ తో కలిసి కలిసి పాల్గొన్నారు.

ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్  కేటాయించి ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి  (27) దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన పి.ఊపేందర్ ఎస్సీ కార్పొరేషన్ కింద సబ్సిడీపై ఆటో మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారిక రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన ఎం.మల్లా రెడ్డి తన ఇంటిని దౌర్జన్యంగా కూలగొట్టి ఆక్రమించుకోవడానికి తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు రాస్తూ వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.

రామగుండం లోని కృష్ణ రామగుండం లోని కృష్ణ నగర్ కాలనీవాసులు ఏ.రాజేశం  కృష్ణానగర్ లో ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గల్లీలో 30 అడుగుల రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణం చేశారని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇట్టి అక్రమ నిర్మాణాన్ని జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ , రామగుండం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామానికి చెందిన ఏ.లలిత తనకు 50% ఫిజికల్ డిసేబిలిటి ఉందని, తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఏ.బుచ్చమ్మ తమకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ లో ఉచిత విద్యుత్తు రావడం లేదని,  కరెంట్ బిల్లు కూడా అధికంగా వస్తుందని,  తన భర్త అనారోగ్యంతో ఉన్నారని, అధిక బిల్లు చెల్లించలేకపోతున్నామని తమకు గృహ జ్యోతి పథకం వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎస్ఈ ట్రాన్స్ కో అధికారికి రాస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ  సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Harsha said public problems should be solved in order of priority