TRINETHRAM NEWS

సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*ప్రజావాణిలో వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష ప్రజల దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

పెద్దపల్లి మండలం పెద్ద కల్వల గ్రామానికి చెందిన అర్నకొండ నర్సయ్య తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఎం.శ్రీకాంత్ తన తండ్రి రామయ్య కు అనారోగ్యం ఉంటే తన ఊరిలోని డాక్టర్ కు చూపిస్తే ఇంజక్షన్ చేయడం వల్ల కాలు స్పర్ష, నడక కోల్పోయారని, కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేస్తే 26 వేల ఖర్చు జరిగిందని,ఆర్.ఎం.పి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

రామగిరి మండలం,కల్వచర్ల గ్రామానికి చెందిన కుర్రొళ్ళ వాడ వీధి సభ్యులు కుర్రొళ్ళ వాడ సందులో తాత ముత్తాతల నుంచి ఉన్న దారిని సదానందం అనే వ్యక్తి మూసివేస్తూ అడ్డంగా గోడ కడుతున్నాడని, దీనివల్ల దాదాపు 15 కుటుంబాలకు దారి ఉండదని, దీనిని నివారించేలా చూడాలని కోరుతూ దాకా వస్తే చేసుకోగా రామగిరి తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App