TRINETHRAM NEWS

District Collector Koya Harsha is active in improving the minimum learning abilities of students

*పాఠశాల విద్య పై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లతో నిర్వహించిన లర్నింగ్ ఇంప్లిమెంట్ ప్రోగ్రాం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, సెప్టెంబర్ -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యం పెంపుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి జిల్లాలొని బాలికల ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు నిర్వహించిన లర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, హై స్కూల్ లెవెల్ ప్రతి విద్యార్థికి తరగతికి సంబంధించిన అభ్యసన సామర్ధ్యాలు సాధించే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కృషి చేయాలని దానికి ప్రధానోపాధ్యాయులు సహకరించాలని అన్నారు

విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసినప్పుడే ఉపాధ్యాయ వృత్తికి సార్ధకమని తెలిపారు. అలాగే పాఠశాలలలో జరుగుతున్న కరీకులర్ కో కరికులర్ యాక్టివిటీస్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి స్కిల్ బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఏకాగ్రత చూపాలని, పదవ తరగతి విద్యార్థుల కోసం అదనపు తరగతుల నిర్వహించి విద్యార్థులలో సందేహాలను నివృత్తి చేయాలని ఈసారి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, జిల్లా అకడమిక్ అధికారి పీఎం షేక్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App