రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం 20 లక్షల 24 వేల రూపాయలు వసూళ్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష
రామగుండం, అక్టోబర్ -30 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రామగుండం లోని సింధూర ఇంజనీరింగ్ కళాశాల నుంచి 20 లక్షల 24 వేల 140 రూపాయలను వసూలు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రామగుండం కార్పొరేషన్ లో ఉన్న సింధూర ఇంజనీరింగ్ కళాశాల ఆస్తి పన్ను గత 5 సంవత్సరాల నుండి చెల్లించని కారణంగా రామగుండం మున్సిపల్ కమిషనర్ ద్వారా వచ్చిన దరఖాస్తుకు రామగుండం తహసీల్దార్ కుమార స్వామి ద్వారా సంబంధిత కళాశాల ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి, ఆస్తి పన్ను చెల్లించని పక్షంలో రెవెన్యూ శాఖ ఆస్తి నీ స్వాధీనం చేసుకుని వేలం నిర్వహిస్తుందని నోటీసులు జారీ చేయడంతో సింధూర ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు బకాయిలో ఉన్న ఆస్తిపన్ను 20 లక్షల 24 వేల రూపాయలను బుధవారం చెల్లించడం జరిగిందని మరియు ఇదే విదంగా ఇంకో (9) మంది రామగుండం కార్పొరేషన్ కి ఆస్తి పన్ను బకాయి ఉన్నారని వారికి కూడ తహసీల్దార్ రామగుండం నోటీసులు జారీ చేశారని వారు కూడ చెల్లించని పక్షం లో చట్టప్రకారం వారి ఆస్తులను రెవిన్యూ శాఖ ద్వారా స్వాధీన పర్చుకుని వేలం ద్వారా బకాయిలు వసూలు చెయ్యడము జరుగుతుంది అని ఈ 9 మంది లో ఒక సినిమా థియేటర్ యజమాని హైకోర్టు నూ ఆశ్రయించి స్టే పొందేందుకు ప్రయత్నం చేసినప్పటికీ సకాలం లో తహసిల్దార్ రామగుండం హై కోర్టు లో కౌంటర్ దాఖలు పర్చి వారికి స్టే రాకుండా కూడా అడ్డుకోవడం జరిగిందని అన్నారు.వారి వివరాలు 1.దేవప్ప కవిత టాకీస్ వారు 3448763/- ఆస్తి పన్ను, 2.లోటస్ ఎంబీఏ కళాశాల వారు 1467845/- రూపాయల ఆస్తి పన్ను, 3.నారాయణ సురేందర్ రెడ్డి రామిరెడ్డి గురువారెడ్డి 2407960 4. వీరాంజనేయ ఇండస్ట్రీస్ 1840006/- రూపాయల, 5.ఫణి జూనియర్ కళాశాల 900013/- 6. ముక్క నరసింహమూర్తి 2543229/- 7.సదానందం థియేటర్ 360947/- రూపాయల, 8.1167350/- రూపాయల, 9. కాసరి పాపయ్య 258546/-రూపాయల ఆస్తి పన్ను దీర్ఘ కాలికంగా జిల్లాలో వివిధ స్థానిక సంస్థలకు ఆస్తి పన్ను బకాయి ఉన్నాయని అన్నారు.ఆస్తి పన్ను బకాయి ఉన్నవారు వీలైనంత త్వరగా చెల్లించగరని లేనిచో అందరి పై ఇలాగే రెవిన్యూ రికవరీ చట్టం ద్వారా పన్ను భాఖాయిలని వసూలు చేసేందుకు తహసిల్దార్ ల ను రంగం లోకి దించుతనని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App