District Child Care Committee Additional Collector J. Aruna inspected the child care centers
రామగుండం, జూన్ -14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బాలల సంరక్షణ కేంద్రాలను జిల్లా చైల్డ్ కేర్ కమిటీ సభ్యులతో కలిసి తనీఖీ చేయడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తెలిపారు.
శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ రామగుండంలో ఉన్న తబిత బాలల సంరక్షణ కేంద్రం, గోదావరిఖని లోని అమ్మ పరివార్ బాల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా చైల్డ్ కేర్ కమిటీతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేసి, అక్కడ వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించామని అన్నారు. జిల్లాలో ఉన్న పిల్లల సంరక్షణ కోసం స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ అధ్యక్షతన చైల్డ్ కేర్ కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ లో జిల్లా సంక్షేమ అధికారి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సొసైటీ సభ్యులు, డిసిపిఓ, వైద్య ఆరోగ్య శాఖ సభ్యులు, తదితరులు ఉంటారని అన్నారు.
బాలల సంరక్షణ కేంద్రాలను ఆసాంతం పరిశీలించి, అక్కడ పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను తనిఖీ చేశారు.
రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రం తనిఖీ సందర్భంగా చైల్డ్ కేర్ కమిటి పిల్లలతో మాట్లాడగా, ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా వండర్ లా, సినిమా థియేటర్ కు ఇటీవలె పంపడం జరిగిందని, తాము చాలా సరదాగా గడపామని తెలుపుతూ, తబిత సంరక్షణ కేంద్రం పిల్లలు జిల్లా కలెక్టర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ కేర్ కమిటి కన్వీనర్ జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సభ్యులు డిప్యూటీ డిఎంహెచ్ఓ కృపా భాయ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App