TRINETHRAM NEWS

వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చౌడపూర్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎన్కేపల్లి శ్రీనివాస్, కోశాధికారి కడిచర్ల రత్నం, జిల్లా అధికార ప్రతినిధి పరిగి రాములు, జిల్లా సలహాదారులు వసంత్ కుమార్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ ఎల్ శ్రీనివాస్, మరియు అనంతరాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App