
డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులు టెస్ట్ చేయించారు. యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు.
తనకు డ్రగ్స్ అలవాటు లేదని తన స్నేహిచుడు రఘుచరణ్ను కలిసేందుకు మాత్రమే రాడిసన్ హోటల్‌కు వెళ్లి అరగంట మాత్రమే ఉన్నానని క్రిష్ చెబుతున్నారు…
