నేటి నుండి గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 14
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కల్తీ ఆహారం తినడం వలన 42 విద్యార్థులు చనిపోవడమే గాక చాలామంది ఆసుప త్రులు పాలయ్యారు. ఇటు వంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కొత్త నియమం ప్రవేశపెట్టింది.
పేద విద్యార్థులకు పోషకా హారం అందించడానికి వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రారంభించింది, దీనికోసం 40 శాతం కాస్మోటిక్, చార్జీలను 200కు పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం మెనూ లో మార్పులు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రారంభం కానుంది. ఒక్కో వారం మెనూ మారుతుండగా.. నెలకు రెండు,సార్లు మటన్, చికెన్ విద్యార్థులకు పెట్టనున్నారు.
వీటితో పాటు ఉడికించిన గుడ్లు, బ్రేక్ టైమ్‌లో పండ్లు, మిల్లెట్ బిస్కెట్లు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మెనూ మార్చింది.
విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా కొత్త మెనూ ఈ రోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నెలకు రెండు సార్లు లంచ్‌లో మటన్, నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు.వారానికి ఒక్కో మెనూ..మిగతా రోజుల్లో అయితే ఉడికిం చిన కోడి గుడ్లు, ఫ్రైడ్ ఎగ్ పెట్టనున్నారు.
వీటితో పాటు కిచిడీ, చపాతీ, ఇడ్లీ, వడ, పూరి, బోండా, పులిహోరతో పాటు రాగిజావ, పాలు వంటివి ఇవ్వనున్నారు. బ్రేక్ సమయాల్లో ఏదైనా పండు ఇవ్వడంతో పాటు పెసర్లు, బటానీలు, మిల్లెట్ బిస్కెట్లు ఇవ్వనున్నారు.
ఇలా ఒక్కో వారానికి ఒక్కో మెనూ ఉంటుంది. ఇప్పటి వరకు నెలకు ఆరుసార్లు చికెన్ పెడుతున్నారు. కానీ ఇకపై మటన్ కూడా పెట్టనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App