ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించారా?
ఇప్పుడు గాలి బ్యాచ్లను ప్రజలపై వదిలారు..
నల్గొండలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
2014 జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో.. 2023 డిసెంబరు 7కు అంతే ప్రాధాన్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిదని అన్నారు. నల్గొండ జిల్లాలోని మెడికల్ కాలేజీలో జరిగిన తొలి ఏడాది కాంగ్రెస్ పాలన- కాంగ్రెస్ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండ వ్యక్తేనని అన్నారు. నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తొస్తుందని పేర్కొన్నారు. నల్గొండలో కృష్ణాజలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App