![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-14.39.21.jpeg)
కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
ఏఐటీయుసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలీలు
హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 05ఫిబ్రవరి 2025. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల పుట్టగొట్టాలని చూస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లను ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చూస్తుంది దాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటియుసి హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కు రాజు గౌడ్ డిమాండ్ చేశారు అలాగే రైతులకు మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతులకు అనుమతి లేకుండానే రైల్వే ట్రాకులను జాతీయ రహదారులకు జిల్లా రహదారులకు తమ భూములను లాక్కునే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది దీన్ని గతంలో రద్దు చేస్తానని చెప్పి అనేక మంది ఢిల్లీ నడి బోర్డులో రైతులు ఆందోళన చేస్తే వాటిని విరమించుకున్నాడు..
కానీ మళ్ళీ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ శక్తుల వలన నల్ల చట్టాలను మళ్ళీ తెరపైకి తీసుకువచ్చి వీటిని అమలు చేసే దిశగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కార్మికులకు రైతులకు రోజు కార్మిక చట్టాలను దొంగలతో ఈ ప్రభుత్వాలు గద్దెదించడం ఖాయం కావున ఇప్పటికైనా చట్టాలను వెనక్కి తీసుకొని కార్మిక చట్టాలు అమలుపరచాలని వారికి 8 గంటల పని విధానాన్ని, పెన్షన్ విధానాన్ని ,పిఎఫ్ విధానాన్ని, అమలు పరచాలని తెలియ చేస్తున్నాము. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున రైతులు ,కార్మిక, ఉద్యోగ సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అనంతరం జాయింట్ కలెక్టర్ (జె.సి) వెంకట్ రెడ్డి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేల్పుల సారంగపాణి , మున్సిపల్ ప్రధాన కార్యదర్శి వేల్పుల ధర్మరాజు , సహాయ కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ ఓషాపాక సందీప్ కుమార్, లంక దాసరి అశోక్ , కుక్కల మల్లయ్య ,బత్తిని సదానందం, వర్కింగ్ ప్రెసిడెంట్ దర్ముల రామ్మూర్తి , ఎల్లస్వామి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Dharna](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-14.39.21-1024x973.jpeg)