TRINETHRAM NEWS

రథోత్సవ కార్యక్రమానికి భారిగా చేరుకుంటున్న భక్తులు..!

ఆదిశిలా క్షేత్రం: కలియుగ ప్రత్యక్ష దైవం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి 11 గంటలకు శ్రీ తిమ్మప్ప స్వామి మహారథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. గద్వాల సంస్థానాదిశులు నల్ల సోమనాద్రి హయాం నుండి జరుగుతున్న మల్దకల్ బ్రహ్మోత్సవాలు లో కీలకమైన రథోత్సవం రోజున లక్షల మంది భక్తులు స్వామివారి రథోత్సవాన్ని తిలకిస్తారు. ఇoదుకు దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య, పంచాయితీ, తదితర శాఖల ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలు విజయవంతం చేయనున్నారు.మంగళవారం తెల్లవారుజామునుంచే మల్దకల్ శ్రీ స్వయంభూలక్మి వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయానికి బారులు తీరిన భక్తులు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా,అణువణువునా కట్టుదిట్టంగా పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అటు గద్వాల రూట్ నుండి, ఇటు అయిజ రూట్ నుండి, అటు కర్నాటక రాయచూర్ జిల్లా నుండీ గట్టు మద్దెల బండ రూట్ లో బారి ఎత్తున భక్తులు మల్దకల్ కు చేరుకుంటున్నారు.

దాసంగాల సమర్పణ..

మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి కుల దైవముగా భావించే ప్రతి కుటుంబం మంగళవారం స్వామివారికి కొత్త కుండలో అన్నం, పరమాన్నం వండి స్వామివారికి దాసంగం సమర్పిస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుండి ఎద్దుల బండ్లు ఇతర వాహనాలలో మల్దకల్ చేరుకుంటున్నాయి.