అర్హులందరికీ అభివృద్ధి పథకాలు
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి(గుండ్లపల్లి) మండల పరిధిలోనీ బొల్లనపల్లి గ్రామం, డిండి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల అమలు కోసం నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రజలలో మమేకం కావడానికి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వాస్తవ పరిస్థితులను గుర్తించడానికి ఇలాంటి గ్రామసభలు ఉపయోగపడతాయని అన్నారు దశలవారీగా ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అర్హులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏటా 12000 అందజేస్తామని చెప్పారు.
సాగుకు యోగ్యమైన ప్రతి ఒక్క ఎకరానికి ఏడాదికి 12,000 చొప్పున రైతు భరోసా జనవరి 26 తారీకు నుండి రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.
ప్రతి పేద కుటుంబానికి ఉచిత విద్య, వైద్యం ఇల్లు, కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిది అని అన్నారు.
అనంతరం డిండి మండల కేంద్రంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన, గ్రామసభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App