TRINETHRAM NEWS

జగత్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప లోని పార్కులను అభివృద్ధి చెయ్యండి :సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

గత నెల ప్రజవానిలో పార్కులను అభివృద్ధి చెయ్యాలని సిపిఐ గా వినతిపత్రం ఇస్తే ఇప్పటివరకు సంబందిత అధికారులు స్పందించలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులకు ఆదేశాలు జరిచేసి వెంటనే అభివృద్ధి అయ్యేలా చూడాలని నేడు గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారికి సిపిఐ బృందం మరోసారి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు డిప్యూటీ కమిషనర్ గారితో మాట్లాడుతూ జగత్గిరిగుట్ట రాజీవగృహకల్ప లోని పార్కులు నిరూపయోగంగా ఉన్నాయని, అందులో మట్టి,వ్యర్దాలు వేసుతున్నారని, రాత్రి సమయంలో గంజాయి,మందు బాబులకు అడ్డగా మారాయని కావున వెంటనే మరమత్తులు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని చెప్పారు.అదే విదంగా రాజీవగృహకల్ప లో రోడ్డు కు ఇరువైపుల డబ్బాలు వేసుకొని ఆ వ్యాపారం మాటున వెనుక ఉన్న స్థలాన్ని ఆక్రమించడానికి చూస్తున్నారని ఇదే విషయం పత్రికలో వచ్చాయని దింట్లో జి హెచ్ ఏం సి కాంట్రాక్టర్ హస్తం ఉందని కూడా వచ్చాయని దీన్ని అలాంటి వారు మునిసిపల్ కు ఎలాంటి సంబంధం ఉన్నా వెంటనే వారి పై చర్య తీసుకోవాలని కోరారు.లేకపోతే దీన్నే అదునుగా చూసుకొని ఇతర మునిసిపల్ వారు కూడా పనిచేసే అవకాశం ఉన్నదన్నారు.అలాగే జగత్గిరిగుట్ట రోడ్ నంబర్ 1లొ సీసీ రోడ్ పూర్తిగా ద్వంసం అయ్యిందని కొత్త రోడ్డు వెయ్యాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, సహాదేవ్ రెడ్డి,ఇమామ్,వెంకటేష్ లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App