Trinethram News : ప్రజా పాలన కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్లు
ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2వ వార్డ్ లో ప్రగతి నగర్ లో గణేష్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పాలన కేంద్రాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్ గారితో కలిసి సందర్శించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరఖాస్తుదారులు అర్హులైన ప్రతీ ఒక్క సంక్షేమ పథకానికి ధరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యత అధికారులదేనన్నారు.