సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ లో అవగాహన సదస్సు నిర్వహించిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ మోహన్ సింగ్.
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వర్ధన్నపేట డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మోహన్ సింగ్ మంగళవారం వరంగల్ లోని రాయపర్తి తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీ లో హెల్త్ ఎడ్యుకేషన్ అవగాహన సదస్సు నిర్వహించినారు ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యాసంస్థలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు జిల్లా టీ.బీ అండ్ లెప్రసీ నియంత్రణ అధికారి డాక్టర్.మోహన్ సింగ్ తెలియజేశారు. సీజనల్ వ్యాధులు, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అనర్థాలను కాలేజీలో స్టూడెంట్స్ కి పూర్తిగా వివరించారు.
విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ వో సూచనలు సలహాలు అందజేశారు. అలాగే అక్కడ వండిన వంటకాలను చెక్ చేయడం జరిగింది, అనంతరం స్కూల్లో పిల్లలు తినే ఆహారం పరిశీలించి వంటకాలు చాలా బాగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సరిత , పల్లె దవఖన డాక్టర్ మహేష్, డాక్టర్లు అన్వేష్ , హెల్త్ అసిస్టెంట్ ప్రేమ్ , కాలేజీ స్టూడెంట్స్ మరియు స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App