Deputy CM Bhatti Vikramarka met Odisha CM Mohan Charan today
Trinethram News : Hyderabad : 2015లో ఒడిస్సా రాష్ట్రం లోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం, సజావుగా నిర్వహణకు సహకరిం చాల్సిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం ఉదయం ఒడిశాకు బయలుదేరారు.
నైని బొగ్గు గని కేటాయింపు, వివిధ రకాల అనుమతులు, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఇవాళ ఒడిస్సా సిఎంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చించను న్నారు..
బొగ్గు మంత్రిత్వ శాఖ, జిఒఐ ఒడిశాలోని అంగుల్ జిల్లాలో నైని బొగ్గు గనిని 2015 సంవత్సరంలో సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ కి కేటాయించింది. నైని బొగ్గు గని గరిష్ట స్థాయి సామర్థ్యం 10 ఎంటిపిఎ ఎస్ సిసిఎల్ 51:49 ఈక్వి టీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది.
ప్రస్తుతం, ఎస్ సిసిఎల్ తెలంగాణలో 39 బొగ్గు గనులలో 2 x 600 MW పవర్ ప్లాంట్‌ను నిర్వహి స్తోంది. ఎస్ సిసిఎల్ దేశంలోని మొత్తం బొగ్గు అవసరాలలో 7.5%ని తీరుస్తోంది.
నైని ప్రాజెక్ట్ గ్రౌండింగ్ కోసం అవసరమైన అన్ని అనుమతులు మార్చి 23 నాటికి వచ్చాయి. ఇటీవల, ప్రస్తుత ప్రభుత్వ మద్దతు తో, రాష్ట్ర అటవీ శాఖ వారు 04.07.2024 నాటి లేఖ ప్రకారం అటవీ భూమిని ఎస్ సిసిఎల్ కి అప్పగించారు.
ఈ విషయంలో తక్షణం చర్యలు తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.తెలిపారు. ఒడిస్సా సీఎం..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App